News March 1, 2025
చెస్ ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు టాప్-10లో నిలిచారు. మూడో స్థానంలో గుకేశ్(2787), ఐదో స్థానంలో అర్జున్ ఎరిగైసి (2777), ఎనిమిదో ర్యాంకులో ప్రజ్ఞానంద(2758) ఉన్నారు. గుకేశ్కు తన కెరీర్లో ఇదే హైయెస్ట్ ర్యాంకింగ్. కాగా తొలి రెండు స్థానాల్లో కార్ల్సన్(2833), నకమురా(2802) కొనసాగుతున్నారు.
Similar News
News September 17, 2025
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం

TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తున్న ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గన్పార్క్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. వారి త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. మరోవైపు ఖమ్మంలో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
News September 17, 2025
మావోయిస్టు పార్టీ లేఖపై అనుమానాలు!

ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజైన లేఖపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇప్పటి వరకు ఇలా సంతకం, ఫొటోతో లేఖ రిలీజ్ కాలేదు. AUG 15వ తేదీ అని ఉంది. మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేస్తామనే ప్రకటన ఇంత సులభంగా ఉండదు. దానికి దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ ఉంటుంది’ అని చెబుతున్నారు. మరోవైపు ఈ లేఖను వెరిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News September 17, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,11,710కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 పతనమై రూ.1,02,400 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,42,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.