News March 16, 2024
అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణి

అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణికి టిక్కెట్ కేటాయిస్తూ అధిష్ఠానం సస్పెన్స్‌కు తెరదించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన గుమ్మా తనూజారాణికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్ తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తనూజారాణి తండ్రి శ్యాం సుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ సర్పంచ్‌గా చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
విశాఖ: 4 రోజులు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని కలెక్షన్ కౌంటర్లు 24 నుంచి 27వ తేదీ వరకు అనగా.. శని, ఆది, సోమ, మంగళ వారాలలో కూడా పనిచేస్తాయని విద్యుత్ సంస్థ ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ శ్యాంబాబు తెలిపారు. వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనూ, ఈ-సేవ, మీసేవ కౌంటర్లలో చెల్లించుకోవచ్చని ప్రకటించారు.
News January 23, 2026
మురికివాడల రహిత నగరంగా విశాఖ

మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు GVMC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మురికివాడలు ఎక్కడుంటే అక్కడే ఇళ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఎన్ని ఇళ్లు నిర్మించాలన్నది సర్వే చేసి DPR తయారుచేయనున్నారు. ఇప్పటికే దీనిపై మంత్రి నారాయణ, కమిషనర్ కేతన్ గార్గ్ మురికివాడలను సందర్శించారు. నగరంలో దాదాపు వందకు పైగా మురికివాడలు ఉన్నాయి. దశల వారీగా వీటిని అభివృద్ధి చేయనున్నారు.
News January 23, 2026
GVMC కౌన్సిల్ సమావేశం.. 15 అంశాల ఎజెండా

ఈనెల 30న జరిగే GVMC కౌన్సిల్ సమావేశంలో 15 అంశాలతో ఎజెండాను తయారు చేశారు. మేయర్ పిలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశం ఉ.11 గంటలకు ప్రారంభం కానుంది. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీ బదలాయింపు, క్రమబద్దికరించే అంశాన్ని ఎజెండాలో పొందుపరిచారు. GVMC ఉద్యోగుల సర్వీస్ అంశం, సింహాచలం తొలిపంచ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద రూ1.25 కోట్ల అభివృద్ధి పనులు వీటిలో కలవు.


