News May 14, 2024

ఓటమి భయంతోనే చెవిరెడ్డి దాడులు: నాని కుమారుడు

image

AP: పక్కా ప్రణాళికతోనే తన తండ్రిపై దాడి చేశారని పులివర్తి నాని కుమారుడు వినీల్ ఆరోపించారు. మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు వస్తే బీర్ బాటిల్స్, గొడ్డళ్లతో దాడి చేశారన్నారు. డ్రైవర్ లేకపోతే తన తండ్రి ప్రాణాలతో ఉండేవారు కాదన్నారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని, పోలీసులూ సహకరించారని ఆరోపించారు. 15 రోజుల్లో ఆయనకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Similar News

News March 4, 2026

రాజ్యసభ రేసు: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉత్కంఠ

image

TG: రాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో ఉత్కంఠగా మారింది. 1 స్థానం సింఘ్వీకి ఖరారైనట్లే. రెండో ప్లేస్‌కు వేం నరేందర్ రెడ్డి కోసం CM రేవంత్ పట్టుబడుతుండగా, తనకు అవకాశమివ్వాలని ప్రియాంక గాంధీ ద్వారా AICC కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రమణ నాయక్ పేరు తెరపైకి వచ్చింది. రమణ నాయక్ CMకు సన్నిహితుడే. TDP అధినేత CBNతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి.

News March 4, 2026

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. VAPT, ITGC ఆడిటర్, RED టీమ్ లీడ్ పోస్టులు ఉన్నాయి. BSc, BTech/BE అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ప్రిలిమినరీ/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: recruit.southindianbank.bank.in

News March 4, 2026

వరుసగా విఫలం.. అయినా నం.1 గానే అభిషేక్!

image

T20ల్లో ఇటీవల వరుసగా <<19276161>>విఫలమవుతున్నా<<>> తన నం.1 ర్యాంకును అభిషేక్ శర్మ నిలబెట్టుకున్నారు. 874Ptsతో తొలిస్థానంలో ఉన్నారు. అయితే పాక్ బ్యాటర్ ఫర్హాన్(848) నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ODIల్లో మిచెల్, కోహ్లీ, జద్రాన్, రోహిత్, గిల్ టాప్-5లో ఉన్నారు. బౌలింగ్‌లో టెస్టుల్లో బుమ్రా, T20ల్లో వరుణ్, ODIల్లో రషీద్ ఖాన్ టాప్‌లో ఉన్నారు. టీమ్ ర్యాంకుల్లో ODIలు, T20ల్లో ఫస్ట్, టెస్టుల్లో 4వ ప్లేస్‌లో ఇండియా ఉంది.