News September 10, 2025
చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (A-38)కి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలోనూ చెవిరెడ్డి పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. కాగా ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది.
Similar News
News March 24, 2026
ధురంధర్-3 ఉందా?

తొలి 2 పార్ట్‌లు బ్లాక్ బస్టర్ కావడంతో ధురంధర్-3 కూడా రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 14న వస్తోందంటూ ఏకంగా రిలీజ్ డేట్ కూడా కొందరు వైరల్ చేస్తున్నారు. దీనిపై ధురంధర్ క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా తాజాగా స్పందించారు. ‘చాలా రూమర్స్ వస్తున్నాయి. అలాంటిదేమీ లేదు’ అని తేల్చి చెప్పారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ధురంధర్-2కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
News March 24, 2026
మహిళలకు LSలో 273 సీట్లు.. APలో 12, TGలో 8?

లోక్‌సభ సీట్లు 816కి పెంచనుండడంతో 33.5% రిజర్వేషన్ల కోటా కింద మహిళలకు 273 స్థానాలు దక్కనున్నాయి. అత్యధికంగా UPలోని LS సీట్లు 120కి పెరుగుతుండడంతో అందులో 40 స్త్రీలకు దక్కుతాయి. MHలో 24, WB 21, TN, బిహార్‌లో 20 చొప్పున వారికి వెళ్తాయి. కాగా APలో 12-13, TGలో 8-9 LS స్థానాలు మహిళలకు దక్కే ఛాన్సుంది. కాగా విధివిధానాలు ఖరారయ్యాక ఎన్ని? ఏయే స్థానాలు మహిళలకు రిజర్వు అవుతాయో స్పష్టంగా తేలనుంది.
News March 24, 2026
GK: స్వాతంత్య్ర సమరయోధులు – రచనలు

☛ మహాత్మా గాంధీ – సత్యశోధన (My Experiments with Truth)
☛ జవహర్‌లాల్ నెహ్రూ – ది డిస్కవరీ ఆఫ్ ఇండియా
☛ బాల గంగాధర్ తిలక్ – గీతా రహస్యం (Karma-Yoga Shastra)
☛ లాలా లజపతిరాయ్ – అన్‌హ్యాపీ ఇండియా
☛ డా. బి.ఆర్. అంబేడ్కర్ – అనైలేషన్ ఆఫ్ కాస్ట్, థాట్స్ ఆన్ పాకిస్థాన్
☛ మౌలానా అబుల్ కలాం ఆజాద్ – ఇండియా విన్స్ ఫ్రీడమ్
☛ సుభాష్ చంద్రబోస్ – ది ఇండియన్ స్ట్రగుల్
☛ సరోజినీ నాయుడు- ది గోల్డెన్ త్రెషోల్డ్


