News December 29, 2024

14,300 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహం

image

భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నెల 26న ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్, మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ కమాండర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆర్మీ పేర్కొంది. విగ్రహం బలగాల్లో స్ఫూర్తి నింపడంతో పాట భారత వీరత్వాన్ని ప్రత్యర్థులకు గుర్తుచేస్తుందని స్పష్టం చేసింది.

Similar News

News January 18, 2026

మిచెల్ మరో సెంచరీ..

image

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ ప్లేయర్ <<18860730>>మిచెల్<<>> 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. వరుసగా ఇది రెండో శతకం కావడం గమనార్హం. అటు ఈ సిరీస్‌లో 300+ స్కోరుతో కొనసాగుతున్నారు. భారత్‌పై వన్డేల్లో 11 ఇన్నింగ్సుల్లో మిచెల్‌కు ఇది నాలుగో సెంచరీ. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 36 ఓవర్లలో 201/3గా ఉంది.

News January 18, 2026

ఎన్టీఆర్, YSR సెంటిమెంటుతో రేవంత్ వ్యూహం!

image

TG: ఖమ్మం పాలేరులో జరిగిన సభలో CM రేవంత్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. NTR స్ఫూర్తితో సన్నబియ్యం, YSR స్ఫూర్తితోనే ఉచిత కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ దివంగత నేతలకు ఖమ్మంలో ఫాలోయింగ్ ఎక్కువనే సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో BRSను ఓడించేందుకు CM వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

News January 18, 2026

రుక్మిణీ వసంత్ డేటింగ్?.. క్లారిటీ!

image

‘కాంతార-2’ భామ రుక్మిణీ వసంత్ ఫొటో SMలో వైరలవుతోంది. ఓ వ్యక్తితో ఆమె క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఫొటోలో ఉన్న వ్యక్తి సిద్ధాంత్ నాగ్ కాగా, అతనొక ఫొటోగ్రాఫర్ అని సమాచారం. వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఇది 2023లో దిగిన ఫొటో కాగా తాజాగా వైరలవ్వడం గమనార్హం. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్-నీల్, టాక్సిక్ మూవీల్లో నటిస్తున్నారు.