News December 10, 2024

చలికాలంలో చియా సీడ్స్‌తో ఎంతో మేలు!

image

చలికాలంలో వేధించే చర్మ సమస్యలకు చియా సీడ్స్ చక్కటి పరిష్కారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తేమను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. సాల్మన్‌ చేపల కంటే వీటిల్లో ఎక్కువగా ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడు పనితీరు మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఫ్లూ వంటి వాటిపై కూడా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ పోరాడతాయంటున్నారు.

Similar News

News February 5, 2025

ఢిల్లీ బీజేపీదే.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్

image

ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరి 42-50, జేవీసీ పోల్ 39-45 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. కాగా కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

News February 5, 2025

ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్‌ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.

News February 5, 2025

SWIGGY నికర నష్టం రూ.799 కోట్లు

image

FY25 మూడో త్రైమాసికంలో ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. గతేడాది ఇదే టైంలో రూ.574 కోట్లు నష్టం చవిచూడగా ఈసారి నికర నష్టం రూ.799 కోట్లకు చేరుకుంది. FY25 Q3లో రూ.3,700 కోట్లుగా ఉన్న ఖర్చులు ఇప్పుడు రూ.4,898 కోట్లకు పెరగడమే నష్టాలకు కారణమని సమాచారం. ఆపరేషన్స్ రెవెన్యూ మాత్రం 31% వృద్ధిరేటుతో రూ.3049 కోట్ల నుంచి రూ.3993 కోట్లకు పెరిగింది. టాప్‌లైన్ సైతం 11% గ్రోత్‌ నమోదు చేసింది.

error: Content is protected !!