News March 30, 2025

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ హైదరాబాద్, నల్గొండ, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కిలో చికెన్ రూ.230- రూ.260 వరకు విక్రయిస్తున్నారు. వరుస సెలవుల సందర్భంగా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరను పెంచి అమ్మకాలు చేస్తున్నారు. గత వారం బర్డ్ ఫ్లూ వ్యాప్తి, భయంతో చికెన్ కొనుగోళ్లు పడిపోగా కిలో రూ.150కే అమ్మారు. మీ ప్రాంతంలో కిలో చికెన్ ధర ఎంత ఉందో COMMENT చేయండి.

Similar News

News December 8, 2025

రూ.500 కోట్ల కామెంట్స్.. కాంగ్రెస్ నుంచి సిద్ధూ భార్య సస్పెండ్

image

సీఎం పోస్ట్ కొనుక్కోవడానికి తమ వద్ద రూ.500 కోట్లు లేవంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్‌ను పార్టీ నుంచి పంజాబ్ కాంగ్రెస్ తొలగించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అమరిందర్ సింగ్ తెలిపారు. కాగా ఆమె వ్యాఖ్యలు పంజాబ్‌లో తీవ్ర దుమారం రేపడంతో తన కామెంట్స్‌ను వక్రీకరించారని కౌర్ అన్నారు.

News December 8, 2025

3,131 ఉద్యోగాలు.. BIG UPDATE

image

SSC CHSL-2025 టైర్-1 ఆన్‌లైన్ పరీక్షల కీ విడుదలైంది. అభ్యర్థులు https://ssc.gov.in/లో రిజిస్ట్రేషన్, పాస్‌వర్డ్‌తో లాగినై కీ, రెస్పాన్స్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి అభ్యంతరాలను తెలపవచ్చు. కాగా 3,131 ఉద్యోగాలకు నవంబర్ 12 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

News December 8, 2025

70-20-10.. ఇదే ప్రమోషన్ ఫార్ములా!

image

ప్రమోషన్ ఇవ్వడానికి 70-20-10 ఫార్ములాను కంపెనీలు ఫాలో అవుతాయి. 70% వర్క్ ఎక్స్‌పీరియన్స్‌, 20% మెంటార్‌షిప్, ఫీడ్‌బ్యాక్, కోచింగ్, 10% కోర్సులు, ట్రైనింగ్‌ ఆధారంగా ప్రమోషన్ ఇస్తాయి. ప్రాజెక్టులు డీల్ చేసిన విధానం, చిన్న టీమ్స్‌ లీడ్ చేయడం, తోటి ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్, ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ట్రైనింగ్, ఒత్తిడిని అధిగమించడం, క్లిష్ట సమయాల్లో ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుని ప్రమోషన్లు ఇస్తాయి.