News March 31, 2024
ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు
నేడు ఈస్టర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘సత్యంలో ఉన్న శక్తిని, విశ్వాసాన్ని ప్రపంచానికి చాటిన మహిమాన్వితమైన పర్వదినం ఈస్టర్’ అని ఏపీ సీఎం జగన్ పేర్కొనగా.. ‘మనుషుల్లో దేవుడిగా జన్మించి మానవత్వపు పరిమళాలను విశ్వవ్యాపితం చేసిన ఏసు క్రీస్తు స్మృతిలో జరుపుకునే వేడుక ఈస్టర్’ అని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
Similar News
News December 30, 2024
TODAY HEADLINES
* ANR వల్లే మరోస్థాయికి టాలీవుడ్ ఖ్యాతి: మోదీ
* ఏపీలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
* ఏపీలో సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు
* ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి!
* ఏపీలో రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్లు
* తిరుమలలో అందరినీ సమానంగా చూడాలి: శ్రీనివాస్ గౌడ్
* అల్లు అర్జున్‌కు ఓయూ జేఏసీ హెచ్చరికలు
* టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్‌కు అరుదైన గౌరవం
*రామ్‌చరణ్ భారీ కటౌట్.. ప్రపంచ రికార్డు
News December 30, 2024
రేపు పవన్ కీలక సమావేశం
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం అధికారులు, ఉద్యోగులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇటీవల జరుగుతున్న దాడుల వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో చర్చించనున్నారు. ఉద్యోగుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కార్యాలయాల్లో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలా? అనే అంశాలపై ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోనున్నారు.
News December 30, 2024
మంత్రి అచ్చెన్నాయుడు గొప్ప మనసు
AP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.