News October 29, 2024
చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసు.. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ పిటిషన్
AP: చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసులో ఇద్దరు నిందితులకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఖైదీల విడుదల సాధన సమితి ప్రభుత్వాన్ని కోరింది. 32 ఏళ్లుగా వారు జైల్లో మగ్గిపోతున్నారని హోంమంత్రి, న్యాయశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. 1993లో హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వెళ్తున్న బస్సును చలపతి, విజయవర్ధన్ దోచుకోవడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు ఎదురుతిరగడంతో పెట్రోల్ చల్లి నిప్పు పెట్టడంతో 23 మంది దుర్మరణం చెందారు.
Similar News
News October 30, 2024
నవంబర్ 2 నుంచి యాదాద్రిలో కార్తీక మాస పూజలు
TG: యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాస పూజలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ప్రతి రోజు 6 బ్యాచుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. గుట్ట కింద వ్రత మండపంలో ఒకేసారి 2వేల జంటలు పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
News October 30, 2024
వారికి టెన్త్‌లో పాస్ మార్కులు 10 మాత్రమే
AP: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగే టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన(మెంటల్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ) విద్యార్థులకు పాస్ మార్కులను 10(గతంలో 35)గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని పేర్కొన్నారు.
News October 30, 2024
నవాబ్ మాలిక్‌కు మద్దతివ్వం: బీజేపీ
దావూద్ ఇబ్రహీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత నవాబ్ మాలిక్ NCP(అజిత్ పవార్) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే మాలిక్‌కు తాము మద్దతు ఇవ్వట్లేదని BJP నేతలు తెలిపారు. దావూద్‌తో సంబంధాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు తమకు నచ్చిన నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. సిట్టింగ్ స్థానాన్ని వదిలేసిన మాలిక్ మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి బరిలో ఉన్నారు.