News March 19, 2024

సీఎంవోకి చేరిన చిలకలూరిపేట పంచాయితీ

image

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. స్థానిక వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడిని CM జగన్ పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఇన్‌ఛార్జ్‌‌గా రాజేశ్‌‌ని తప్పించిన అధిష్ఠానం గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని చిలకలూరిపేట అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో టికెట్ కోసం మంత్రి రజినీ రూ.6.5కోట్లు తీసుకున్నారని రాజేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Similar News

News July 8, 2024

‘నీట్’పై విచారణ గురువారానికి వాయిదా

image

‘నీట్’ పేపర్ లీకేజీపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పేపర్ లీకైన మాట వాస్తవమే. లీకేజీతో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. కానీ ఎంతమందికి చేరిందన్నది గుర్తించలేదు. అన్నీ జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తాం’ అంటూ విచారణను వాయిదా వేసింది.

News July 8, 2024

రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన?

image

తెలంగాణ సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. తొలుత తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట. రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News July 8, 2024

హిండెన్‌బర్గ్ వివాదం.. దర్యాప్తు చేపట్టిన కోటక్!

image

కింగ్‌డన్ క్యాపిటల్ తమ సంస్థ వేదికగా అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌కు పాల్పడటంపై కోటక్ గ్రూప్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హిండెన్‌బర్గ్‌తో కింగ్‌డన్‌కు సంబంధాలు ఉన్నాయని ముందే తెలిస్తే అసలు FPI అకౌంట్‌నే ఓపెన్ చేసే వాళ్లము కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్‌డన్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం దాచిందని అనుమానిస్తున్నాయి. ఇందుకు ఆధారాలు లభిస్తే కోటక్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.