News April 4, 2025

బర్డ్‌ ఫ్లూతో చిన్నారి మరణం.. రంగంలోకి కేంద్రం

image

AP: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో <<15964152>>తొలి మరణం<<>> సంభవించడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ, ముంబై‌, మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన పలువురు డాక్టర్లతో కలిసి అధ్యయనం చేయిస్తోంది. నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి ఎప్పుడు అనారోగ్యానికి గురైంది? ఎప్పుడు ఆస్పత్రిలో చేరింది? వైద్యులు ఎలాంటి చికిత్స అందించారు? అనే వివరాలను ఆ బృందం ఆరా తీసింది. చిన్నారి కుటుంబీకులు చికెన్ కొనుగోలు చేసిన దుకాణంలో శాంపిల్స్ సేకరించింది.

Similar News

News April 11, 2025

విషాదం: NIT విద్యార్థి ఆత్మహత్య

image

వరంగల్ జిల్లాలోని NITలో విషాదం చోటుచేసుకుంది. సంస్థలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్ సాయి అనే విద్యార్థి స్థానిక వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం హైదరాబాద్‌ కాగా ఎన్‌ఐటీ హాస్టల్‌లోనే నివాసముంటున్నాడని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2025

మాజీ ప్రియురాలిపై యువకుడి విచిత్ర ప్రతీకారం!

image

కోల్‌కతాలోని లేక్‌టౌన్ ప్రాంతంలో సుమన్ సిక్దర్ అనే యువకుడు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై విచిత్రంగా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో 4 నెలల వ్యవధిలో 300కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్‌ను ఆమె ఇంటికి బుక్ చేశాడు. ఆ డెలివరీలు తనకెందుకు వస్తున్నాయో తెలియక తీవ్ర ఒత్తిడికి గురైన యువతి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 11, 2025

వేసవిలో వాకింగ్.. ఎప్పుడు చేయాలంటే..

image

వాకింగ్ అలవాటున్నవారికి వేసవిలో వేడిమి సమస్యగా ఉంటుంది. వారు ఆలస్యంగా లేచి వాకింగ్ చేయడం మంచిదికాదని జీవనశైలి నిపుణులు పేర్కొంటున్నారు. ‘సమ్మర్‌లో ఉదయం 7.30 గంటల్లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడి తీవ్రత పెరుగుతుంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటాక, సాయంత్రం 5 గంటలలోపు ఆరుబయట వ్యాయామం, వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు’ అని సూచిస్తున్నారు.

error: Content is protected !!