News April 2, 2025
బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. రాష్ట్రంలో తొలి కేసు

AP: పచ్చిమాంసం తిన్న 2ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు (D) నరసరావుపేటలో జరిగింది. రాష్ట్రంలో ఈ వైరస్‌తో మనుషులు మరణించడం ఇదే తొలిసారి. అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 16న మృతిచెందింది. పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది. కోడిని కోసేటప్పుడు అడగ్గా ఓ ముక్క ఇచ్చామని, అది తిన్న చిన్నారి జబ్బు పడిందని పేరెంట్స్ చెప్పారు.
Similar News
News April 3, 2025
మోదీ నాకు గొప్ప స్నేహితుడే కానీ..: ట్రంప్

పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. PM మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. US మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.
News April 3, 2025
అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం

AP: నిన్న ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా శాసనసభ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్‌మన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేశారు. మొత్తం రూ.4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు.
News April 3, 2025
‘ఉప్పల్’కు బీసీసీఐ నో ఛాన్స్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంపై బీసీసీఐ చిన్న చూపు చూసింది. ఈ ఏడాది ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహణకు మొగ్గు చూపలేదు. నిన్న విడుదల చేసిన వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్‌ల షెడ్యూల్‌లో ఉప్పల్ స్టేడియం పేరే లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి SAతో మూడో వన్డేకు విశాఖపట్నం మాత్రమే ఆతిథ్యమివ్వనున్నట్లు పేర్కొంది. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ఐపీఎల్ మ్యాచులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.