News December 10, 2024

ఏలూరు ఘటనపై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం

image

AP: ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్‌లో ఇంటర్ బాలిక ప్రసవం, <<14828392>>బిడ్డను విసిరేయడంపై<<>> రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మండిపడింది. ఈ ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తామని తెలిపింది. హాస్టల్ పిల్లలపై సిబ్బంది, పేరెంట్స్ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందంది.

Similar News

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.

News November 22, 2025

ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

News November 22, 2025

రబీ వరి.. ఇలా నాటితే అధిక దిగుబడి

image

వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. బెంగాలీ కూలీలు వరి నారును వరుస పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య 6-8 అంగుళాల దూరం ఉండేలా నాటి.. 9 వరుసలకు ఒక కాలిబాట తీస్తున్నారు. దీని వల్ల మొక్కల మధ్య గాలి, వెలుతురు బాగా తగిలి, చీడపీడల ఉద్ధృతి తగ్గి దిగుబడి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ఎకరాకు 15KGల విత్తనం చాలు. కూలీల ఖర్చు కూడా తగ్గడంతో పెట్టుబడి తగ్గుతుంది. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.