News July 19, 2024
నేరస్థులవుతున్న బాలలు.. పరిష్కారమేంటి?

AP: ఓ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో 2022లో బాలల నేరాల సంఖ్య 912. దీనిలో 41మంది పిల్లలు అత్యాచారం మరో 27మంది హత్యలు చేశారు. ఏటేటా ఇది మరింతగా పెరుగుతోంది. పెద్దవారిని దారిలో పెట్టేందుకు శిక్షలున్నాయి. తప్పొప్పుల తేడా తెలియని పిల్లల్ని శిక్షించేదెలా? నేరతీవ్రతను బట్టి పెద్దలతో సమానంగా శిక్షించాలా? లేక మారుతారన్న నమ్మకంతో పరివర్తనకు కృషి చేయాలా? తాజా ముచ్చుమర్రి ఘటన ఇలాంటి ప్రశ్నల్నే లేవనెత్తుతోంది.
Similar News
News October 20, 2025
దేశంలో యూపీఐ ద్వారానే 85% డిజిటల్ చెల్లింపులు: RBI

ఇండియాలో 85శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో పేర్కొన్నారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయన్నారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని వివరించారు.
News October 20, 2025
దీపావళి: ఈ నియమాలు పాటిస్తున్నారా?

దీపావళి రోజున చేసే లక్ష్మీదేవి పూజలో ఇనుప వస్తువులు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది నెగటివ్ శక్తిని పెంచుతుందని అంటున్నారు. ‘నేడు ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఆడవారిని ఎట్టి పరిస్థితుల్లో బాధపెట్టకూడదు. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఇంట్లో బూజు దులపకూడదు. తులసి ఆకులు కోయకూడదు. ఇలా ఇస్తే.. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్తుంది’ అని చెబుతున్నారు.
News October 20, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. ఆర్జిత సేవలు రద్దు

AP: దీపావళి పండుగ వేళ తిరుమలలో రద్దీ నెలకొంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 84,017 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.97 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఇవాళ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు.