News March 19, 2024
మోదీ ప్రచారంలో పిల్లలు.. ఈసీ సీరియస్

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, మోదీ ప్రచారంలో రోడ్డుపై విద్యార్థులను మొహరించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వార్తాపత్రికల్లో దీనిపై కథనాలొచ్చాయని, ఎన్నికల ప్రచారంలో పిల్లలను తీసుకురావడం చట్టరీత్యా నేరమని ఈసీ తెలిపింది. హెడ్ మాస్టర్‌తో పాటు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖ అధికారి వివరణ ఇవ్వాలన్నారు.
Similar News
News April 9, 2025
ప్రజల వద్దకే పాస్‌పోర్ట్ సేవలు

AP: మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇంటివద్దే పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు ‘మొబైల్ వ్యాన్’ను అధికారులు సిద్ధం చేశారు. ఈ వ్యాన్ ఏ రోజు రూట్‌లో ప్రయాణిస్తుందో వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకుంటే మీ ప్రాంతంలోనే సర్టిఫికెట్ల పరిశీలన, వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక పోస్టులో పాస్‌పోర్టు పంపుతారు.
News April 9, 2025
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

నిన్న భారీ లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చైనాపై టారిఫ్లను ట్రంప్ 104%కు పెంచడం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 వద్ద కొనసాగుతున్నాయి. జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాప్ లూజర్.
News April 9, 2025
ఏడాది పాటు AU శతాబ్ది ఉత్సవాలు

AP: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. ఏప్రిల్ 26న ఉత్సవాలను ప్రారంభించి ఏడాది పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని ఏయూ వీసీ రాజశేఖర్‌తో మంత్రి లోకేశ్ సూచించారు. QS ర్యాంకింగ్స్‌లో టాప్-100లో AU ఉండేలా చూడాలని ఆదేశించారు. వర్సిటీల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.