News September 23, 2024

పిల్లలకు లైంగిక విద్య అవసరం: సుప్రీం కోర్టు

image

పిల్లలకు లైంగిక విద్య అత్యంత ఆవశ్యకమని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ ఉండాలని పేర్కొంది. ‘లైంగిక విద్య పాశ్చాత్యుల విధానమని, మన వద్ద ప్రారంభిస్తే పిల్లలు చెడిపోతారని ఓ దుష్ప్రచారం ఉంది. ఓ అధ్యయనం ప్రకారం.. సమగ్ర సెక్స్ ఎడ్యుకేషన్ వారిలో అవగాహనను పెంచుతుంది. తద్వారా వారు పోర్న్‌కు, లైంగిక నేరాలకు అలవాటు పడకుండా ఆపే అవకాశం ఉంటుంది’ అని తెలిపింది.

Similar News

News September 23, 2024

ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలో రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే ఫ్యామిలీ కార్డుగా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, రూరల్ ప్రాంతాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటి మానిటరింగ్‌కు జిల్లాలవారీగా వ్యవస్థ ఉండాలని సూచించారు. దీని కోసం పలు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు.

News September 23, 2024

వరద పరిహారంపై ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: వరద బాధితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. పంట నష్టంపైనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఎల్లుండి నుంచి పరిహారం బాధితులకు అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 23, 2024

పోలీసుల కాల్పుల్లో బదలాపూర్ నిందితుడి మృతి

image

మహారాష్ట్రలోని బదలాపూర్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల కాల్పుల్లో మరణించాడు. పోలీసులు వాహనం ఎక్కిస్తుండగా వారి నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడు. పోలీసులు తిరిగి ఎదురుకాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని థానే పోలీసులు వెల్లడించారు.