News March 1, 2025
పిల్లలను 4 రెగ్యులర్ షోలకు అనుమతించాలి: హైకోర్టు

TG: రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ థియేటర్లకు హైకోర్టులో ఊరట దక్కింది. 16 ఏళ్ల లోపు పిల్లలను 4 రెగ్యులర్ షోలకు అనుమతించాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. మరోవైపు తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.
Similar News
News March 1, 2025
‘ఛావా’ తెలుగు ట్రైలర్ ఎప్పుడంటే?

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ను ఈ నెల 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక నటించారు. హిందీలో కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా ఈ నెల 7న తెలుగులో రిలీజ్ కానుంది.
News March 1, 2025
BREAKING: జైలులో పోసానికి అస్వస్థత

AP: అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు అతడిని జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆయనకు కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
News March 1, 2025
విరుష్కను ఫాలో అయిన ఆలియా.. ఫొటోలు డిలీట్!

తన కుమార్తె రాహా ముఖాన్ని సోషల్ మీడియాలో చూపించకూడదని నటి ఆలియాభట్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇన్స్టాగ్రామ్ సహా అన్ని హ్యాండిల్స్ నుంచి ఆమె ఫొటోలను డిలీట్ చేశారు. జామ్నగర్, పారిస్లో తీసుకున్న వాటినీ ఉంచలేదు. రాహా ముఖం కనిపించని ఒకే ఒక్క చిత్రాన్ని మాత్రం అలాగే ఉంచారు. ఆమె తీసుకున్నది సరైన నిర్ణయమేనని నెటిజన్లు అంటున్నారు. విరుష్క జోడీ తమ పిల్లలను ఎప్పట్నుంచో SMకు దూరంగా ఉంచడం తెలిసిందే.