News January 27, 2025
పిల్లలను ఆ సమయంలో థియేటర్లలోకి అనుమతించొద్దు: హైకోర్టు

TG: సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రా.11 నుంచి ఉ.11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను FEB 22కు వాయిదా వేసింది.
Similar News
News November 21, 2025
రాజీనామా యోచనలో కడియం..?

వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఫిరాయింపుల విషయంలో రాజీనామా చేయించాలని చూస్తోంది. స్టే.ఘనపూర్ MLAగా ఉన్న కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి BRSను ఇరుకున పెట్టడానికి CM రేవంత్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇదే వేడిలో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్కు గ్రౌండ్లో మరింత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల్లో కడియం రాజీనామా చేసే అవకాశముంది.
News November 21, 2025
మిస్ యూనివర్స్-2025 ఫాతిమా బాష్ గురించి తెలుసా?

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. స్కూల్లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్యాక్టివిటీ డిజార్డర్తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్గా నిలిచారు.
News November 21, 2025
పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఇదే: వైద్యులు

పిల్లల్ని కనడానికి ఏ వయసు ఉత్తమమో వైద్యులు సూచించారు. ‘ఆరోగ్యకరమైన గర్భధారణ, బిడ్డ కోసం స్త్రీల ఏజ్ 20-30 మధ్య ఉండాలి. 35 తర్వాత గర్భధారణ డౌన్ సిండ్రోమ్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి. పురుషులకు 25-35 ఏళ్లు ఉత్తమం. 40ఏళ్ల తర్వాత పుట్టేబిడ్డల్లో ఆటిజం, జన్యు సమస్యల ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఏజ్ 35 కంటే తక్కువ ఉన్నప్పుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి’ అని చెబుతున్నారు.


