News September 21, 2024

ఈ 7 అలవాట్లతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు

image

కొన్ని అలవాట్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవి 1.గోర్లు కొరకడం. దీని వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. 2.తినేటప్పుడు TV/ఫోన్ చూడటం. 3.ఎక్కువగా హెడ్‌ఫోన్స్ వాడటం. 4.నిద్రపోయే ముందు ఫోన్ చూడటం. 5.బెడ్‌పై పడుకొని తినడం. ఇలా తింటే జీర్ణక్రియ సరిగా జరగదు. 6.పళ్లు కొరకడం. దీని వల్ల సెన్సిటివిటీ, దవడ నొప్పి వస్తుంది. 7.పికీ ఈటింగ్‌. దీని వల్ల పోషకాలున్న ఆహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

Similar News

News January 23, 2026

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA, MCom, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును careers@bobcaps.inకు ఈ మెయిల్ చేయాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/

News January 23, 2026

మెస్సీ మ్యాచ్‌కు CSR నిధులు… ఇరకాటంలో సింగరేణి

image

TG: నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు సహా సింగరేణి కార్యకలాపాలపై కేంద్ర బృందం లోతుగా పరిశీలిస్తోంది. కోల్ మైన్ టెండర్ల నిబంధనల వివాదం, అక్రమాలపై ఆరా తీస్తోంది. CSR నిధులపైనా దృష్టి పెట్టింది. ఇటీవల ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఈవెంట్‌కు CSR నిధులు వినియోగించారు. ఈవెంట్‌ కోసం ₹10cr నిధులు వాడినట్లు ప్రకటించడం తెలిసిందే. 3 రోజుల్లో ఈ బృందం కేంద్రానికి నివేదిక అందించనుంది.

News January 23, 2026

మారని BCB నిర్ణయం.. T20 WCలో స్కాట్లాండ్‌!

image

T20 WC నుంచి BAN నిష్క్రమణ దాదాపు ఖరారు కావడంతో స్కాట్లాండ్‌ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్సర్స్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చేందుకు ICC సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. T20 WCలో ఆడాలనే ఉన్నా తమ ప్లేయర్ల భద్రత దృష్ట్యా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. FEB 7న WIతో కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌లో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.