News June 2, 2024
బిడ్డ మృతి.. ఫ్లెక్సీతో తల్లిదండ్రుల నిరసన

AP:వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణం తీసిందని పేరెంట్స్ టెక్కలిలో ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. SKLM(D) చిన్ననారాయణపురానికి చెందిన వినీత్(12)ను పాము కాటేసింది. ముల్లు గుచ్చుకుందని డాక్టర్లు 2 గంటలు వదిలేశారని, పరిస్థితి విషమించాక SKLM తీసుకెళ్తుండగా బాబు చనిపోయాడని పేరెంట్స్ చెప్పారు. ‘పాముకాటుకు, ముల్లుకు తేడా తెలియని డాక్టర్లకు వందనాలు. వారిపై ఏం చర్య తీసుకుంటారు’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Similar News
News September 7, 2025
పాలలో కొవ్వు శాతం తగ్గడానికి కారణాలు

* గేదె, ఆవు పాలకు మార్కెట్లో మంచి ధర రావాలంటే వాటిలోని కొవ్వు శాతమే కీలకం.
* పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గతుంది.
* అలాగే పశువులను అధిక దూరం నడిపించినప్పుడు, అవి ఎదలో ఉన్నప్పుడు, వ్యాధులకు గురైనప్పుడు కూడా ప్రభావం పడుతుంది.
* అకస్మాత్తుగా మేతను మార్చినప్పుడు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి సమంగా ఇవ్వకపోవడం వల్ల కూడా వెన్నశాతం అనుకున్నంత రాదు.
News September 7, 2025
ఉసిరితో కురులు మురిసె

* వర్షాకాలంలో జుట్టు సమస్యలు తగ్గడానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది
* ఎండు ఉసిరి ముక్కలను కొబ్బరి/బాదం నూనెతో తక్కువ మంట మీద వేడిచేసి, చల్లార్చి ఫిల్టర్ చేయాలి.
* ఈ నూనెను వారానికి 2, 3సార్లు తలకు మసాజ్ చేసి తేలికపాటి షాంపూతో స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
* ఉసిరి పొడిని పెరుగు/కొబ్బరిపాలతో పేస్టులా తయారుచేసి కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. 30ని. తర్వాత వాష్ చేసుకుంటే జుట్టు మృదువుగా మారుతుంది.
News September 7, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం ఏపీలోని విజయవాడ, గుంటూరులో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220 ఉండగా, ఇవాళ రూ.240కి విక్రయిస్తున్నారు. అటు హైదరాబాద్, కామారెడ్డిలో రూ.240గా ఉంది. వినాయక నిమజ్జనాలు ముగియడం, ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.