News July 3, 2024

దర్శన్ ఖైదీ నంబర్‌తో చిన్నారి ఫొటోషూట్.. కేసు నమోదు

image

తన ఫ్యాన్‌ను చిత్రహింసలు పెట్టి చంపారనే ఆరోపణలపై జైలుకెళ్లారు కన్నడ హీరో దర్శన్. అయినప్పటికీ కర్ణాటకలో అతడి ఫ్యాన్స్ అభిమానం వెర్రితలలు వేస్తూనే ఉంది. తాజాగా ఓ జంట తమ బిడ్డకు ఖైదీ నంబర్ 6106 (జైల్లో దర్శన్‌కు కేటాయించిన నంబర్) అని రాసి ఉన్న వైట్ డ్రస్ వేసి ఫొటో షూట్ చేశారు. ఇది వైరల్ కావడంతో బాలల హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. కాగా.. చాలామంది ఫ్యాన్స్ 6106ను టాటూగా వేయించుకుంటుండటం గమనార్హం.

Similar News

News January 19, 2026

జగిత్యాల: ‘గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం’

image

జగిత్యాల న్యాక్ సెంటర్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పన్నుల వసూలు, బడ్జెట్ రూపకల్పన, పంచాయతీ పాలన, పారిశుధ్య నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రికార్డులు, ఖర్చుల వివరాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

News January 19, 2026

ఇండియన్ క్రికెట్‌లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

image

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్‌గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్‌లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

News January 19, 2026

ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

image

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించిన రిజర్వేషన్ల సమాచారాన్ని SEC వెబ్‌సైట్లో పొందుపరిచింది. నిన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మున్సి‘పోల్స్’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. FEB 14 నుంచి ఈ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇపుడు SEC రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని స్పష్టమవుతోంది.