News October 16, 2025
భారత్‌పై WTOకి చైనా ఫిర్యాదు

ఇండియా అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్, EV బ్యాటరీ సబ్సిడీలపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇది దేశీయ తయారీదారులకు అన్యాయమైన ప్రయోజనాన్ని కల్పిస్తోందని, చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. తమ దేశీయ పరిశ్రమల ప్రయోజనాలు, హక్కుల కోసం కఠిన చర్యలు తీసుకుంటామని వారి వాణిజ్య శాఖ హెచ్చరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే IND అధిక సబ్సిడీలు అందిస్తోందని అసహనం వ్యక్తం చేసింది.
Similar News
News October 16, 2025
సృష్టిలో శివ-శక్తి స్వరూపం

శివలింగాలు ప్రధానంగా 2 రకాలు. అవి స్థావరలింగం, జంగమ లింగం. చెట్లు, లతలు స్థావర లింగాలు కాగా, క్రిమి కీటకాదులు జంగమ లింగాలు. స్థావర లింగాన్ని నీరు పోసి సంతోషపెట్టాలి. జంగమ లింగాన్ని ఆహార వస్తువులతో తృప్తిపరచాలి. ఇదే నిజమైన శివ పూజ. సర్వత్రా ఉన్న పీఠం దేవి స్వరూపం. లింగం సాక్షాత్తూ చిన్మయ స్వరూపం. ఇలా సృష్టిలోని ప్రతి అంశంలోనూ శివ-శక్తి స్వరూపాన్ని గుర్తించి, సేవించడమే ఉత్తమ పూజా విధానం. <<-se>>#SIVOHAM<<>>
News October 16, 2025
రాష్ట్రంలో 218 పోస్టులు… అప్లై చేశారా?

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ 218 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 97 ఉండగా, ఫ్యాకల్టీ పోస్టులు 121 ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఈ నెల 21, ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 26 దరఖాస్తుకు ఆఖరు తేదీ. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
News October 16, 2025
జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదు: సీబీఐ

AP: విదేశీ పర్యటనకు వెళ్లిన YCP చీఫ్ జగన్ తన సొంత ఫోన్ నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలు ఇవ్వాలనే షరతులను జగన్ ఉల్లంఘించారని HYD సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.