News March 17, 2025
పాక్‌కు మరో జలాంతర్గామిని ఇచ్చిన చైనా

తమ మిత్రదేశం పాకిస్థాన్‌కు చైనా మరో జలాంతర్గామిని అందించింది. 5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మొత్తం 8 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లను ఇస్లామాబాద్‌కు బీజింగ్ ఇవ్వాల్సి ఉండగా గతంలో ఒకటి ఇచ్చేసింది. ఈ రెండూ కాక అత్యాధునిక ఫ్రిగేట్ నౌకలు నాలుగింటిని కూడా సమకూర్చింది. అరేబియా సముద్రంలో భారత్‌ను అడ్డుకునేందుకు పాక్‌ను వాడుకోవాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పాక్ నేవీని బలోపేతం చేస్తోంది.
Similar News
News September 18, 2025
అసెంబ్లీ సమావేశాలు కుదింపు

AP: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల పనిదినాలను ప్రభుత్వం 8 రోజులకు కుదించింది. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత అసెంబ్లీని ఈనెల 30 వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో <<17749258>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే. అటు రేపు మధ్యాహ్నం రూ.1.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.
News September 18, 2025
OCT 1 నుంచి అమల్లోకి ఆన్లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం

ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించిన కొత్త <<17486290>>రూల్స్<<>> అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, స్టేక్ హోల్డర్స్‌తో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. రూల్స్ అమల్లోకి వచ్చే ముందు గేమింగ్ ఇండస్ట్రీతో మరోసారి చర్చిస్తామన్నారు. ఆన్లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్‌లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?