News December 31, 2024
చైనా మాపై సైబర్ దాడి చేసింది: అమెరికా

చైనా తమపై సైబర్ దాడికి పాల్పడిందని అమెరికా ట్రెజరీ శాఖ చట్టసభకు రాతపూర్వకంగా తెలిపింది. ఈ నెల మొదటివారంలో తమ వర్క్ స్టేషన్లను, కొన్ని డాక్యుమెంట్లను సైబర్ నేరగాళ్లు యాక్సెస్ చేశారని పేర్కొంది. ‘మా సైబర్ భద్రత నిపుణులతో సంప్రదించి పరిస్థితిని చక్కదిద్దాం. దుండగులకు యాక్సెస్‌ను కట్ చేయగలిగాం. ఆధారాల్ని బట్టి ఈ పని చేసింది చైనా ప్రభుత్వ మద్దతున్న సైబర్ హ్యాకింగ్ బృందమే’ అని స్పష్టం చేసింది.
Similar News
News November 28, 2025
ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.
News November 28, 2025
చెక్క దువ్వెన వాడుతున్నారా?

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ, కొబ్బరి, ఆలివ్ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్‌తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్‌తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.
News November 28, 2025
మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

TG: మహబూబాబాద్(D) మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు సరికాదంది. అక్కడ ఉన్న ఆరుగురు STలకు సర్పంచి, 3 వార్డులను కేటాయించడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. ఈ ఎన్నికలో రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ యాకూబ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.


