News April 8, 2025
ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు: చైనా

మరో 50శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తి లేదని చైనా తేల్చిచెప్పింది. ‘ఒత్తిడి పెట్టడమనేది మాతో మాట్లాడే విధానం కాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాం. సరైన పద్ధతిలో చర్చలు జరపాలి. మా హక్కులు, ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్య నుంచైనా మమ్మల్ని మేం కాపాడుకుంటాం’ అని చైనా రాయబారి లియూ పెంగ్యూ స్పష్టం చేశారు.
Similar News
News December 2, 2025
టికెట్ ధరల పెంపు.. నెటిజన్ల ఆగ్రహం!

APలో ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల <<18450771>>పెంపునకు<<>> ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్టర్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు పెంచుకుని ఇలా ప్రేక్షకులపై భారం మోపడం కరెక్ట్ కాదని అంటున్నారు. రేట్లు పెంచితే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఐబొమ్మ రవి లాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సి వస్తోందంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 2, 2025
EPS-95 పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ

EPFO కింద కవరయ్యే EPS-95 పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలన్న డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఆ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. 2019 మార్చి 31నాటికి ఫండ్ విలువలో యాక్చురియల్ లోటుందని తెలిపింది. అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదు. MP సురేశ్ గోపీనాథ్ మాత్రే లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ సమాధానమిచ్చారు. ఈ స్కీమ్ కింద 80 లక్షలకుపైగా పెన్షనర్లున్నారు.
News December 2, 2025
హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు: బండి

హిందువులంటే కాంగ్రెస్‌కు ద్వేషమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. <<18447956>>CM రేవంత్<<>> హిందూ దేవుళ్లను అవమానించారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ MIMకి మోకరిల్లింది. తమది ముస్లింల పార్టీ అని రేవంత్ కూడా అన్నారు. BRS కూడా హిందువులను కించపరిచింది. కానీ BJP ఇతర మతాల్ని అవమానించలేదు. హిందువులు ఇలా అవమానాన్ని భరిస్తూనే ఉంటారా లేదా ఒక్కటవుతారా’ అని పేర్కొన్నారు.


