News July 4, 2024

వాస్తవాధీన రేఖను చైనా గౌరవించాలి: జైశంకర్

image

వాస్తవాధీన రేఖ(LAC)ని చైనా గౌరవించాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ బీజింగ్‌కు స్పష్టం చేశారు. కజకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు సమస్యల్ని త్వరగా పరిష్కరించడంపై తాము చర్చించినట్లు ట్విటర్‌లో తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు ఇరు దేశాల బంధాన్ని నిర్దేశిస్తాయని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 18, 2025

సెప్టెంబర్ 18: చరిత్రలో ఈ రోజు

image

✒ 1883: ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ ధింగ్రా(ఫొటోలో) జననం
✒ 1899: ఫ్రీడమ్ ఫైటర్, కవి గరికపాటి మల్లావధాని జననం
✒ 1950: నటి షబానా అజ్మీ జననం
✒ 1968: దక్షిణాది నటుడు ఉపేంద్ర జననం
✒ 1985: డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ జననం
✒ 1988: క్రికెటర్ మోహిత్ శర్మ జననం
✒ 1989: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప జననం
✒ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
✒ ప్రపంచ వెదురు దినోత్సవం

News September 18, 2025

UAEపై పాకిస్థాన్ విజయం

image

ఆసియా కప్: పాక్ జట్టు UAEపై 41 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 146/9 పరుగులు చేసింది. ఫకర్ జమాన్(50), షాహీన్ అఫ్రీది(29*), సల్మాన్ అఘా(20) రాణించారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రన్ జిత్ 3, ధ్రువ్ 1 వికెట్ తీశారు. UAE 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాహుల్ చోప్రా(35), ధ్రువ్(20) పర్వాలేదనిపించారు. PAK బౌలర్లలో షాహీన్ అఫ్రీది, అబ్రార్, రౌఫ్‌లు తలో 2 వికెట్లతో రాణించారు.

News September 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.