News October 28, 2024

ఆర్థిక అనిశ్చితి కారణంగానే చైనా మెత్తబడింది: పరిశీలకులు

image

ఇతర దేశాలతో నిత్యం కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు బాగా వెనక్కి తగ్గింది. ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండటమే దీనికి కారణమని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ‘చైనా ఆర్థిక పరిస్థితి దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత ఘోరంగా ఉంది. ప్రొవిన్షియల్ ప్రభుత్వాలు దివాలా తీశాయి. రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఈ ఒత్తిడే ఆ దేశ విదేశీ విధానాల్లో మార్పును తీసుకొచ్చింది’ అని పేర్కొన్నారు.

Similar News

News February 15, 2026

CNF అంటే ఏంటో తెలుసా?

image

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It

News February 15, 2026

సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి ఇన్విటేషనేనా?

image

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న రష్మికతో విజయ్ పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారానికి ఈ భేటీ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. రేవంత్ రెడ్డిని తన పెళ్లి లేదా విందుకు విజయ్ ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

News February 15, 2026

నేడు శివరాత్రి.. ఏ రంగు దుస్తులు ధరించాలంటే?

image

మహా శివరాత్రి రోజున డార్క్ రంగు దుస్తులు ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు పండితులు. నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రంగులు ప్రతికూల ప్రభావం చూపుతాయట. అలాగే వీటితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలుపు/పసుపు రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలా పూజ చేస్తే శివానుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.