News April 12, 2025

చైనా ‘రేర్ ఎర్త్’ ఎగుమతుల నిలిపివేత

image

‘రేర్ ఎర్త్’ లోహాల ఎగుమతిని నిలిపేయాలని చైనా నిర్ణయించింది. ఈ నెల 4నే ఈ నిర్ణయం తీసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అరుదైన ఈ లోహాల్ని రక్షణ, ఇంధన, ఆటోమోటివ్ తదితర రంగాల్లో వినియోగిస్తారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన లోహాల దిగుమతుల్లో సుమారు 90శాతం చైనా నుంచే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ ధరలు పెరగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News January 25, 2026

థాంక్యూ ఇండియా: ఇరాన్

image

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో తమకు అండగా నిలిచినందుకు ఇండియాకు ఇరాన్ థాంక్స్ చెప్పింది. ‘మాకు మద్దతు ఇచ్చినందుకు ఇండియాకు కృతజ్ఞతలు. న్యాయం, జాతీయ సార్వభౌమత్వం విషయంలో ఆ దేశ వైఖరికి ఇది నిదర్శనం’ అని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ అన్నారు. కాగా శాంతియుత నిరసనలను ఇరాన్‌ ప్రభుత్వం అణచేస్తోందంటూ UNHRC 39వ ప్రత్యేక సెషన్‌లో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.

News January 25, 2026

వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

image

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతువు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.

News January 25, 2026

కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తా: ట్రంప్

image

చైనాతో ట్రేడ్ డీల్‌పై ముందుకు వెళ్తే కెనడాపై చర్యలు తప్పవని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశాన్ని సజీవంగా చైనా మింగేస్తుంది. వారి వ్యాపారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపేందుకు కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్టుగా ఉపయోగించాలనుకుంటే వాళ్లు పొరపాటు పడినట్లే. డీల్ చేసుకున్న మరుక్షణమే కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.