News April 4, 2025
అమెరికాతో చైనా టారిఫ్ వార్.. 34శాతం సుంకం విధింపు

అమెరికా టారిఫ్లపై చైనా అన్నంత పని చేసింది. US ఉత్పత్తులపై 34శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అన్ని దేశాలపై టారిఫ్లు పెంచిన అమెరికా చైనా పైనా 34శాతం సుంకం విధించింది. దీనిపై ఘాటుగా స్పందించిన డ్రాగన్ దేశం టారిఫ్ తగ్గించకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. కానీ అమెరికా దీనిపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రతీకారంగా చైనా 34శాతం సుంకం విధించింది.
Similar News
News April 11, 2025
ఒంటిమిట్టలో హనుమంతుడు లేని రామయ్య

ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. కానీ, <<16059250>>ఒంటిమిట్ట<<>> ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ‘పూర్వకాలంలో మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ పెరగడంతో రాముడిని ప్రార్థించారు. ఆయన కోదండము, పిడిబాకు పట్టుకొని ఆ యాగాన్ని రక్షించడంతో ఇక్కడే వెలిశారు. అప్పటికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదు’ అని పురోహితులు చెబుతున్నారు.
News April 11, 2025
‘దొంగప్ప’ రిలీజ్ అంటూ మంచు మనోజ్ సెటైర్లు

మంచు కుటుంబంలో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాపై మనోజ్ సెటైర్లు వేశారు. ‘ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంతకీ విడుదల జులై 17నా లేక జూన్ 27వ తేదీనా? రూ.100+ కోట్ల బడ్జెట్(ఇందులో 80 శాతం ViSmith కమీషన్)తో మూవీ PR ప్లానింగ్ కేక’ అని ట్వీట్ చేశారు.
News April 11, 2025
రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు

TG: ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యాసంస్థలకు రేపటి నుంచి ఈ నెల 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. ఆ తర్వాత 18న గుడ్ఫ్రైడేకు హాలిడే ఉంది. ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్న నేపథ్యంలో రెండో శనివారం పలు స్కూళ్లు సెలవు ఇవ్వడం లేదు. అలాంటి వాటికి 13, 14న రెండ్రోజులు సెలవులు ఉంటాయి.