News January 5, 2025
చైనా వైరస్.. వీరికి డేంజర్

చైనా వైరస్ (HMPV) సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని ఏపీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి తెలిపారు. వైరస్ సోకిన 3 నుంచి 10 రోజుల్లోగా దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధ సమస్యలు కనిపిస్తాయన్నారు. వైరస్ సోకిన చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పారు.
Similar News
News January 15, 2026
APPLY NOW: NALCOలో 110 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<
News January 15, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఇవే!

చిరంజీవి కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. మంగళవారం కంటే బుధవారం వసూళ్లు పెరిగినట్లు Sacnilk తెలిపింది. సోమవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.79.60కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు పేర్కొంది. కాగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రూ.120+కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.
News January 15, 2026
₹2 లక్షలు డిస్కౌంట్.. అయినా కొనేవారు లేరు!

ఇండియాలో గ్రాండ్గా ఎంట్రీ ఇద్దామనుకున్న టెస్లాకు గట్టి షాకే తగిలింది. గతేడాది దిగుమతి చేసుకున్న 300 మోడల్ Y కార్లలో దాదాపు 100 అమ్ముడవక షెడ్డుకే పరిమితమయ్యాయి. ముందే బుక్ చేసుకున్న వారూ ఇప్పుడు వెనక్కి తగ్గుతుండటంతో మస్క్ కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. స్టాక్ను క్లియర్ చేసేందుకు ఏకంగా ₹2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. భారీ ధరలు, తక్కువ డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.


