News August 8, 2025
ప్రధాని మోదీకి చైనా స్వాగతం

ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO)లో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత PM మోదీకి చైనా స్వాగతం పలికింది. కాగా ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించనున్నారు. చివరిసారి 2018లో అక్కడికి వెళ్లారు. గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యం ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీటిని పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
Similar News
News August 9, 2025
మీ నిద్రని ట్రాక్ చేస్తున్నారా?

స్లీప్ ట్రాకింగ్‌తో ఎన్నో ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘స్లీప్ ట్రాకింగ్‌తో మీ నిద్ర, శరీరం స్పందిస్తున్న తీరు తెలుస్తుంది. ఎంతసేపు నిద్రపోయారు, ఎంత క్వాలిటీ నిద్ర పోయారో తెలుసుకోవచ్చు. ఈ రికార్డ్స్‌తో చికిత్సలేని కొన్ని నిద్ర సమస్యలను ముందే గుర్తించవచ్చు. దాంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు. స్మార్ట్ వాచ్, హెల్త్ రింగ్, AI పరికరాలతో మీ నిద్రని ట్రాక్ చేసుకోవచ్చు.
News August 9, 2025
SSC CGL పరీక్షలు వాయిదా

ఆగస్టు 13-30 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL) పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఫేజ్-13లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు SSC ప్రకటించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఆ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 14,582 గ్రూప్ B, C పోస్టులకు గతంలో SSC నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News August 8, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* అల్లూరి జిల్లాలో స్కూళ్ల అభివృద్ధికి రూ.45.02కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
* శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద. ఇన్ ఫ్లో 83,242, అవుట్ ఫ్లో 98,676 క్యూసెక్కులు
* జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత తురకా కిశోర్
* స్వచ్ఛత పక్వాడా అవార్డులు-2024లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న విశాఖ పోర్ట్
* పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించాలని TDP కుట్ర: ఎంపీ అవినాశ్ రెడ్డి