News January 20, 2025
చైనా దూకుడు.. ఏడాదిలో 800KMS మెట్రో మార్గం పొడిగింపు!

దేశంలోని నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను గట్టెక్కిస్తోన్న మెట్రో రైళ్లను విస్తరించడంలో ఇండియా స్పీడు పెంచాల్సి ఉంది. 2024లో ఇండియాలో కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే మెట్రో నెట్వర్క్ను విస్తరించినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అదే చైనాలో మాత్రం ఒకే ఏడాదిలో 800+కి.మీలు మెట్రో మార్గాన్ని విస్తరించారు. కాగా, ఇండియాలో మొత్తం 1,000 కి.మీల మెట్రో మార్గం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
Similar News
News December 11, 2025
రాష్ట్రంలో 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<
News December 11, 2025
ఆలయ ప్రవేశం.. ఆరోగ్య కారకం!

గుడికి వెళ్లినప్పుడు చెప్పులను బయటే వదిలేస్తాం. దీనివల్ల ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించదు. దేవాలయ ప్రాంగణంలో ఒట్టి కాళ్లతో నడవడం వల్ల నేలలోని పాజిటివ్ ఎనర్జీ పాదాల ద్వారా శరీరమంతా వ్యాపించి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే దేవతా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అందులో కూడా శక్తిమంతమైన అయస్కాంత శక్తి నిలుస్తుంది. దైవ దర్శనంతో ఆ శక్తి మనలోకి ప్రవేశించి, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.
News December 11, 2025
నేటి నుంచి బీజేపీ బస్సు యాత్ర

AP: మాజీ ప్రధాని, దివంగత వాజ్పేయీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఇవాళ్టి నుంచి ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర చేయనుంది. రాయలసీమలోని ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మోదీ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటన అనంతరం ఈ నెల 25న అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు.


