News February 20, 2025
చైనా దురాక్రమణ.. మోదీ మొద్దు నిద్ర: కాంగ్రెస్

పొరుగు దేశం చైనా మన దేశంపై అరాచకాలతో విరుచుకుపడుతుంటే పీఎం నరేంద్ర మోదీ మాత్రం మొద్దు నిద్ర పోతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ఓ వైపు అరుణాచల్ ప్రదేశ్‌లో 90 గ్రామాల దురాక్రమణ, మరోవైపు బ్రహ్మపుత్ర నదిపై వరల్డ్ బిగ్గెస్ట్ డ్యామ్ నిర్మాణం, ఇంకోవైపు సరిహద్దులు ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకున్నారని ఎడిట్ చేసిన ఫొటోను ట్వీట్ చేసింది.
Similar News
News October 17, 2025
BCCI అపెక్స్ కౌన్సిల్లో చాముండేశ్వరనాథ్

భారత మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ చాముండేశ్వరనాథ్‌కు BCCI అత్యున్నత కమిటీలో చోటు దక్కింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్లో ICA ప్రతినిధిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఆన్లైన్ ఓటింగ్‌లో వి.జడేజాపై ఆయన గెలుపొందారు. దీంతో అపెక్స్ కౌన్సిల్‌కు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. రాజమండ్రికి చెందిన ఈయన ఆంధ్ర తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.
News October 17, 2025
ఉపరాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు

చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆయన ఇంట్లో బాంబు పెట్టామంటూ దుండగులు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
News October 17, 2025
ఆర్మీ క్యాంప్‌పై ‘ఉల్ఫా’ అటాక్

అస్సాంలో ఉల్ఫా మిలిటెంట్లు రెచ్చిపోయారు. తిన్సుకియా జిల్లాలోని కాకోపతార్ ప్రాంతంలో ఆర్మీ క్యాంప్‌పై అర్ధరాత్రి అటాక్ చేశారు. గ్రెనేడ్లు విసిరి తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ట్రక్కులో వచ్చిన మిలిటెంట్లు సుమారు 30 నిమిషాల పాటు దాడులు చేసి పారిపోయారు. దీంతో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానిక అడవుల్లో మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.