News September 25, 2024

భూమికి భారంగా చైనా డ్యామ్!

image

చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఏకంగా 10 ట్రిలియన్ గాలన్ల నీరు అందులో నిల్వ ఉంటుంది. అంత బరువు ఒకేచోట నిల్వ ఉండటం భూమి గమనాన్ని ప్రభావితం చేస్తోంది. 0.06 సెకన్ల మేర భూ పరిభ్రమణ వేగం నెమ్మదించిందని పరిశోధకులు చెబుతున్నారు. దాని వల్ల సూర్యుడి నుంచి 2 సెంటీమీటర్ల దూరం పెరిగిందన్నారు. ఈ డ్యామ్ కారణంగా భూకంపాలు, పెను విపత్తులు సంభవిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 12, 2025

బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

image

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్‌లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్‌ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.

News November 12, 2025

IPPB 309 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB)309 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. Jr అసోసియేట్ పోస్టుకు 20-32 ఏళ్ల మధ్య , Asst.మేనేజర్ పోస్టుకు 20-35ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీలో సాధించిన మెరిట్/ఆన్‌లైన్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 12, 2025

BRIC-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

<>BRIC<<>>-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌ 5 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఎస్సీ, MVSC, డిప్లొమా ఉత్తీర్ణత, NET/GATE/GPAT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. 40-50ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ils.res.in