News January 31, 2025
చైనా డీప్‌సీక్ ఎఫెక్ట్.. ఓపెన్ AI భారీ ఫండ్ రైజింగ్

AI మార్కెట్లో చైనా ‘డీప్‌సీక్’ ప్రకంపనాలు సృష్టిస్తుండటంతో చాట్‌జీపీటీ మేకర్ ఓపెన్ఏఐ అప్రమత్తమైంది. అత్యాధునిక AI మోడల్స్ అభివృద్ధి కోసం $40 బిలియన్ల సేకరించనుంది. జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ అత్యధికంగా $15-25 బిలియన్లు ఇన్వెస్ట్ చేయనుంది. US అధ్యక్షుడు ట్రంప్ $500 బిలియన్ల పెట్టుబడి అంచనాతో ప్రకటించిన స్టార్గేట్ ఏఐ ప్రాజెక్టులోనూ సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ఏఐ భాగస్వాములుగా ఉన్నాయి.
Similar News
News November 17, 2025
మదనాపూర్: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ దేశస్థులు

దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉదయం జపాన్ దేశస్థులు దర్శించుకున్నారు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
News November 17, 2025
మెదక్: సొసైటీ డైరెక్టర్ మృతి

చిన్న శంకరంపేట మండలం జంగారాయి సొసైటీ డైరెక్టర్ సిద్ది రెడ్డి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్ది రెడ్డి మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన సిద్ది రెడ్డి కుటుంబాన్ని సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డైరెక్టర్లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పరామర్శించారు.
News November 17, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కార్తీక పూజలు

పవిత్ర కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా మహానగరంలోని పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


