News May 13, 2024

భారత మార్కెట్లపై చైనా ఎఫెక్ట్!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈనెల 2వేల పాయింట్లకుపైగా నష్టపోయాయి. ఎన్నికల ఫలితాలపై ఊహాగానాలే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే దీని వెనుక విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ప్రభావం కూడా ఉందని తాజాగా అంచనా వేస్తున్నారు. ఈ ఒక్కనెలే రూ.19వేలకోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. భారత్‌తో పోలిస్తే చైనా స్టాక్స్ విలువ తక్కువ ఉండటంతో ఇక్కడ స్టాక్స్ విక్రయించి వాటిని కొనుగోలు చేస్తున్నారట.

Similar News

News March 7, 2026

వార్‌కు వారం!

image

ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయింది. గత శనివారం (FEB 28) ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో US, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. మొదటి రోజే సుప్రీంలీడర్ ఖమేనీ హతం కాగా ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా చనిపోగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.

News March 7, 2026

నేపాల్ రాజకీయాలను మలుపుతిప్పిన ‘స్టార్లు’

image

ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ జోరుతో నేపాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీని వెనుక ఇద్దరు ‘స్టార్లు’ ఉన్నారు. ఒకరు TV ప్రెజెంటర్, RSP ఫౌండర్ రబి లామిచానే కాగా మరొకరు ర్యాపర్ బాలెన్ షా. 2022లో RSP స్థాపించిన రబి, రాజకీయ చతురతతో తక్కువకాలంలో Dy.PM హోదాకు చేరారు. ఇక ర్యాపర్ బాలెన్ షా యువతలో ఆదరణ సంపాదించారు. 2025లో షా RSPలో చేరి రబితో చేతులు కలపడంతో అక్కడి పాలిటిక్స్‌ మలుపు తిరిగాయి.

News March 7, 2026

US-ఇరాన్ పోరు.. డిస్కౌంట్‌లో బంగారం!

image

US, ఇజ్రాయెల్-ఇరాన్ పోరు ప్రభావం బంగారంపైన పడింది. దుబాయ్‌లో వ్యాపారులు తమ స్టాక్స్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారానికి (31 గ్రాములు) దాదాపు 30 డాలర్ల డిస్కౌంట్‌‌కు అమ్మేసుకుంటున్నారు. విమానాల రద్దుతో ఎగుమతులకు అంతరాయం, హై షిప్పింగ్ ఛార్జెస్ వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక భారత్‌లో సమృద్ధిగా బంగారం నిల్వలు ఉన్నందున సరఫరాకు అంతరాయం కలిగినా ఇబ్బంది లేదు.