News July 5, 2024
హిండెన్‌బర్గ్ వివాదంలో చైనా హస్తం?- 2/2

అదానీ గ్రూప్ తమ సంస్థలకు పోటీగా ప్రాజెక్టులు దక్కించుకుంటోందనే అక్కసుతోనే చైనా ఈ కుట్ర చేసి ఉండొచ్చనేది పలు ట్రేడ్ వర్గాల వాదన. హిండెన్‌బర్గ్ ముందస్తుగా తన రిపోర్టును కింగ్‌డాన్ క్యాపిటల్‌కు షేర్ చేసిందని ఆరోపిస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ సైతం దీనిపై Xలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. హిండెన్‌బర్గ్‌కు సహకరించిన భారత ఆర్థిక సంస్థలకు చైనా మూలాల గురించి ముందే తెలుసా? అని ప్రశ్నించారు.
Similar News
News February 2, 2026
తిరుమలలో సర్వ దర్శనానికి 8 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. SSD టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 74,192 మంది స్వామిని దర్శించుకోగా 22,313 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.
News February 2, 2026
పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
News February 2, 2026
స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.


