News June 28, 2024
రక్షణ శాఖ మాజీ మంత్రులపై చైనా అధికార పార్టీ వేటు

అవినీతికి పాల్పడినట్లు తేలడంతో రక్షణ శాఖలో మంత్రులుగా పనిచేసిన ఇద్దర్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ తప్పించింది. పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు వారిపై విచారణ కూడా ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. జనరల్ వే ఫంగ్హా(70), జనరల్ లీ షాంగ్ఫు(66) క్రమశిక్షణను, చట్టాలను ఉల్లంఘించారని, అధికార దుర్వినియోగంతో అవినీతికి పాల్పడ్డారని వివరించింది.
Similar News
News December 7, 2025
గురుస్వాముల పాత్ర ఏంటో తెలుసా?

గురుస్వామి త్రికరణశుద్ధితో, నిష్కళంక మనస్సుతో ఉంటారు. శాంతి, సత్యం, సమానం వంటి దైవ గుణాలతో మెలుగుతారు. దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిగ్రహం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇతరుల భక్తిని, సేవను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేస్తారు. అయ్యప్ప సేవలో నిమగ్నమై, ఇతరుల పొరపాట్లను దండించకుండా క్షమిస్తారు. భక్తులకు దీక్షా నియమాలను స్పష్టంగా తెలుపుతూ, అన్ని విధాలా సహాయం చేస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News December 7, 2025
రోహిత్, కోహ్లీలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే?

ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో పరుగుల వరదతో అభిమానులను అలరించిన రో-కో జోడీ మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో మైదానంలో అడుగుపెట్టనుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్కోట్, ఇండోర్లో న్యూజిలాండ్తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఆ సిరీస్ తర్వాత మళ్లీ జులైలో ENGతో మూడు వన్డేలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోన్న రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడనున్నారు.
News December 7, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⋆ కాంగ్రెస్ పాలనపై ‘ప్రజా వంచన దినం’ పేరిట HYD ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ధర్నా.. హామీలపై చర్చకు రావాలని CM రేవంత్కు కిషన్ రెడ్డి సవాల్
⋆ అసెంబ్లీ స్పీకర్కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. MLAల అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
⋆ ఈనెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షనా? CM జోక్యం చేసుకుని పరీక్షను వాయిదా వేయించాలి: కవిత


