News July 27, 2024
భారత్‌పై చైనా కడుపు మంట (3/3)

హిందూ సముద్రం, ఆసియా ఖండంలో చైనాను భారత్ నిలువరిస్తోంది. వాళ్ల డిఫెన్స్, వాణిజ్యాన్ని దెబ్బకొట్టేస్తోంది. పగతో రగిలిపోతున్న డ్రాగన్ ఢిల్లీని చికాకు పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఒకేసారి జమ్మూ, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి సృష్టించి సైనికులను తలో దిక్కుకు పంపేలా ప్లాన్ చేస్తోంది. అప్పుడు గల్వాన్, అరుణాచల్‌లో ముందుకు సాగొచ్చన్నదే దాని వ్యూహమని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాన్‌లో భాగమే పాక్ BATs.
Similar News
News November 22, 2025
తూ.గో: ఇకపై వేరే లెవెల్.. పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్..!

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా CRC పథకం ద్వారా తీర రక్షణ చర్యలు, యువతకు స్పీడ్ బోట్, స్కూబా డైవింగ్‌లో శిక్షణ కల్పిస్తారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సముద్రంలో చేప పిల్లలను విడుదల, రూ.2 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 200 నాటికల్ మైళ్ల వరకు వేటకు అనుమతి వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
News November 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.


