News March 31, 2025
చైనా వండర్.. సముద్ర గర్భంలో డేటా సెంటర్

టెక్నాలజీలో చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలో తొలిసారిగా సముద్రం లోపల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. హాంకాంగ్కు ఆగ్నేయ దిశలోని లింగ్ షుయి తీరంలో దీన్ని ప్రారంభించింది. ఇక్కడ 400 హైపెర్ఫార్మెన్స్ సర్వర్లను కూల్ చేసే సౌకర్యాలు ఉంటాయి. ఒక సెకన్లో పారిశ్రామిక రంగం నుంచి మెరైన్ రీసెర్చ్ వరకు 7వేల Ai ప్రశ్నలను ప్రాసెస్ చేస్తుంది. ఇది ఆరంభమేనని, మున్ముందు వీటి సంఖ్యను పెంచుతామని పేర్కొంది.
Similar News
News April 2, 2025
రాష్ట్రంలోనే క్లీన్ ఎయిర్ సిటీగా కడప

AP: రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56 ) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.
News April 2, 2025
IPL: హ్యాట్రిక్పై కన్నేసిన RCB

ఐపీఎల్లో భాగంగా ఇవాళ ఆర్సీబీ-జీటీ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆర్సీబీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కేకేఆర్, సీఎస్కేను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఉత్సాహంలో జీటీపై కూడా విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీని తన సొంతగడ్డపైనే ఓడించాలని యోచిస్తోంది.
News April 2, 2025
ఎండాకాలంలో ఈ ఆహారం తింటున్నారా?

సమ్మర్లో ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఆవిరితో చేసిన ఇడ్లీలు, కుడుములు తినాలి. మాంసాహారం, వేపుళ్లకు దూరంగా ఉండాలి. భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నిల్వ పచ్చళ్లను పరిమితంగా తీసుకోవాలి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలి. మజ్జిక, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండటం బెటర్.