News August 6, 2024
పెళ్లికి నో అంటున్న చైనా యువత.. ప్రభుత్వం వర్రీ

జననాల రేటు పడిపోవడం, వృద్ధుల రేటు పెరుగుతుండటం చైనా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి ముఖ్య కారణం అక్కడి యువత పెళ్లిపై విముఖత చూపడమే. ఉద్యోగాల్లో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలని వారు భావిస్తుండటం సమస్యగా మారింది. పిల్లల్ని కన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నా యువత పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 34 లక్షల జంటలు పెళ్లి చేసుకోగా, గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 38.98లక్షలుగా ఉంది.
Similar News
News February 22, 2026
AIIMS బీబీనగర్‌లో 26పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని AIIMS బీబీనగర్‌లో 26 Jr. రెసిడెంట్, Sr. రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, PG, సంబంధిత విభాగంలో MD, DNB, DM, MS, MCh అర్హత ఉండాలి. జూనియర్ రెసిడెంట్ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in
News February 22, 2026
రూ.101, రూ.201, రూ.501.. ఇలా ఎందుకు?

హుండీలో డబ్బు వేసినా, శుభకార్యాల్లో కట్నం పెట్టినా రూ.101, రూ.501.. ఇలా చివర్లో ఓ రూపాయి కలుపుతారు. దీనివల్ల విడదీయలేని బంధం ఏర్పడుతుందని నమ్ముతారు. అదెలా అంటారా? చివర్లో 1 ఉంటే అది అనేక సందర్భాల్లో విభజించడానికి వీలులేని సంఖ్యలా మారుతుంది. అలాగే ఆ రూపాయి భవిష్యత్తులో మరింత సంపదకు ప్రారంభాన్ని కూడా సూచిస్తుందట. ఒకవేళ చివర్లో ‘0’ ఉంటే ఆ సంఖ్యను ముగింపుగా భావిస్తారు. అది అశుభమని చాలామంది నమ్మకం.
News February 22, 2026
జొన్న పంటలో పేనుబంకను ఎలా నివారించాలి?

జొన్నలో పేనుబంక పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన, కాండం మీద కనిపిస్తాయి. వీటి వ్యాప్తి ఎక్కువైతే మొవ్వు లోపల, కంకిని ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు తొలుత పసుపు రంగులోకి మారి తర్వాత వాడి ఎండిపోతాయి. ఈ పురుగు విసర్జితాల వల్ల మొక్కలపై నల్లని బూజు ఏర్పడుతుంది. పేనుబంక నివారణకు లీటరు నీటికి మిథైల్ డెమటాన్ 2ML లేదా డైమిథోయేట్ 2ML కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


