News April 2, 2024

నేను MPగా పోటీ చేయాలనేది చిన్నాన్న చివరి కోరిక: షర్మిల

image

AP: సాక్ష్యాధారాలు ఉన్నా వివేకా హంతకులు నేటికీ తప్పించుకొని తిరుగుతున్నారని షర్మిల అన్నారు. ‘చిన్నాన్నను దారుణంగా చంపితే గుండెపోటుతో చనిపోయారని ‘సాక్షి’లో చూపించారు. ప్రజలు హర్షించరని తెలిసి కూడా అవినాశ్ రెడ్డికే జగన్ టికెట్ ఇచ్చారు. నేను MPగా పోటీ చేయాలనేది చిన్నాన్న చివరి కోరిక. అందుకే ఆయనను కక్షగట్టి హతమార్చారు. YCP నిందితులకు టికెట్ ఇచ్చింది. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా’ అని చెప్పారు.

Similar News

News November 8, 2024

ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

image

AP: ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2024

నోట్ల రద్దుకు 8 ఏళ్లు

image

కేంద్రం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 8 ఏళ్లు పూర్తవుతోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ‘ATMల వద్ద రూ.2వేల కోసం క్యూ కట్టేవాళ్లం. మా వరకు వచ్చేసరికి ATM ఖాళీ అయ్యేది. స్కూల్ ఫీజుల కోసం రెండు మూడు సార్లు లైన్‌లో నిల్చునేవాళ్లం’ అని ట్వీట్స్ చేస్తున్నారు.

News November 8, 2024

Review: నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

image

కథ ఫర్వాలేదు అనుకున్నా, దర్శకుడు సుధీర్ వర్మ తెరపై ఆ స్థాయిలో చూపలేకపోయారు. ఫస్టాఫ్ బోరింగ్‌గా సాగితే సెకండాఫ్‌లో సస్పెన్స్ రివీల్‌లో తేడా కొట్టింది. పాత్రలనూ సరిగ్గా ప్లాన్ చేయలేదు. కొన్నిచోట్ల నవ్వుకోదగ్గ కామెడీ సీన్లుంటాయి. నిఖిల్ సహా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.
రేటింగ్: 1.5/5