News April 15, 2025
వైట్ హౌస్ సెక్రటరీపై చైనా రాయబారి సెటైర్

ప్రతీకార సుంకాలతో చైనా, US మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల ప్రతినిధులు పరస్పరం మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇండోనేషియాలోని చైనా రాయబారి జాంగ్ జిషెంగ్ వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ను టార్గెట్ చేశారు. తమ దేశంలో తయారైన డ్రెస్ను ఆమె ధరించారని ట్వీట్ చేశారు. ‘బిజినెస్ కోసం చైనాను నిందిస్తారు. అవసరానికి చైనా వస్తువులనే కొంటారు’ అని సెటైర్ వేశారు.
Similar News
News November 19, 2025
ఆన్లైన్లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్లైన్లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్లైన్లో అసభ్య మెసేజ్లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.
News November 19, 2025
కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.