News March 19, 2025
పాకిస్థాన్‌లో చైనా ఆర్మీ..!

పాకిస్థాన్‌లో ఆర్మీ, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించేలా చైనా ఒప్పందం చేసుకుంది. సీపెక్ ప్రాజెక్టులోని చైనా కార్మికులని, ఇంజినీర్లను కాపాడేందుకు వీలుగా ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో డ్రాగన్ దేశానికి చెందిన పలు భద్రతా ఏజెన్సీలు పాక్‌లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తాయి. పాక్‌లో బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 19, 2025
తెలంగాణ బడ్జెట్: ఏ శాఖకు ఎంతంటే?

* పశుసంవర్ధకం: రూ.1,674 కోట్లు
* పౌరసరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు
* కార్మిక శాఖ-రూ.900 కోట్లు
* మహిళా శిశు సంక్షేమ శాఖ-రూ.2,862 కోట్లు
* బీసీ సంక్షేమ శాఖ-రూ.11,405 కోట్లు
* మైనార్టీ సంక్షేమ శాఖ-రూ.3,591 కోట్లు
* పరిశ్రమలు-రూ.3,527 కోట్లు
* ఐటీ రంగం-రూ.774 కోట్లు
* చేనేత రంగం-రూ.371 కోట్లు
News March 19, 2025
తెలంగాణ బడ్జెట్ 2025-26 స్వరూపం

*మొత్తం బడ్జెట్- రూ.3,04,965 కోట్లు
*రెవెన్యూ వ్యయం- రూ.2,26,982 కోట్లు
*మూలధన వ్యయం- రూ.36,054 కోట్లు
*ఎస్సీ సంక్షేమం- రూ.40,232 కోట్లు
*పంచాయతీ రాజ్ శాఖ- రూ.31,605 కోట్లు
*వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
*విద్యాశాఖ- రూ.23,108 కోట్లు
*ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
News March 19, 2025
పాత కార్లు ఉంటే దెబ్బేనా?

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను బ్యాన్ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే పాత వాహనాలకు ఇంధనం అమ్మరు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇప్పటికే ఢిల్లీలో నిషేధం అమలవుతోంది. MHతో పాటు మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.