News May 15, 2024
అమెరికాలోకి చైనా సైన్యం వస్తోంది: ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చైనా నుంచి సైనిక వయసున్న ప్రజలు దేశంలోకి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వచ్చేవారంతా ప్రధానంగా పురుషులే. మన దేశంలో చైనా సైన్యాన్ని తయారుచేసేందుకు వారు చూస్తున్నారు. ఏదో ఒకరోజు దాడికి దిగుతారు’ అని ఆరోపించారు. ఇటీవలి కాలంలో అగ్రరాజ్యానికి చైనా నుంచి అక్రమ వలసలు భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Similar News
News March 19, 2026
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ&రేటింగ్

అవినీతి నాయకులు, వారికి సాయపడే టెర్రరిస్టులను హీరో ఎలా ఎదుర్కొన్నారనేదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ. మేనరిజమ్స్, డాన్సులు, నటనతో పవన్ వన్‌మ్యాన్ షో చేశారు. చిరు-పవన్ పాత సాంగ్స్ ఆకట్టుకుంటాయి. శ్రీలీల నటన బాగుంది. ఫ్యాన్స్ కోసం మాస్ ఎలివేషన్స్, డైలాగులతో డైరెక్టర్ హరీశ్ శంకర్ కథను నడిపించారు. ఔట్‌డేటెడ్ స్టోరీ, కొన్ని లాజిక్ లేని సీన్లు, BGM మైనస్. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
రేటింగ్: 2.5/5
News March 19, 2026
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News March 19, 2026
ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గి కిలో రూ.2,65,000 పలుకుతోంది. గత వారంతో పోల్చితే మొత్తంగా రూ.25,000 తగ్గుదల నమోదైంది. అటు <<19423062>>బంగారం<<>> ధరలు కూడా ఇవాళ తగ్గిన విషయం తెలిసిందే.


