News August 19, 2025

ప్రధాని మోదీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ

image

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈమేరకు మోదీ ట్వీట్ చేశారు. గతేడాది తాను జిన్‌పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతి సాధించినట్లు తెలిపారు. వచ్చే SCO సమ్మిట్‌లో ఆయనతో మరోసారి భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇది IND-CHI మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక బంధానికి బాటలు వేస్తుందన్నారు. ఫలితంగా ప్రపంచ శాంతికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Similar News

News August 20, 2025

EPFOలో 230 ఉద్యోగాలు.. గడువు పెంపు

image

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు గడువును పొడిగించారు. ఈనెల 18తో అప్లికేషన్ తేదీ ముగియగా 22 వరకు పెంచుతూ UPSC నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై, 35 ఏళ్లలోపు ఉండాలి. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి.
వెబ్‌సైట్: <>upsconline.nic.in<<>>

News August 20, 2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి.. ఈ పార్టీలు ఎటువైపు?

image

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును INDI కూటమి ప్రకటించడం TDP, JSP, YCP, BRSలను ఇరకాటంలోకి నెట్టాయి. వెంకయ్య నాయుడు తర్వాత మరోసారి తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. కానీ APలో BJPతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన TDP, JSP పొత్తు ధర్మం పాటిస్తాయా? లేక తెలుగు వ్యక్తికి ఓటేస్తాయా అన్నది ఆసక్తికరం. YCP, BRS కూడా ఎటువైపు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.

News August 20, 2025

రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు: మంత్రి అనగాని

image

APలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. ఆ శాఖ అధికారులకు సెలవులను రద్దు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వదంతులు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కరకట్టకు ఆనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అవసరమైతేే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.