News October 26, 2024
ట్రంప్, వాన్స్ ఫోన్లను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు

రిపబ్లికన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఫోన్లలో డేటాను చైనీస్ హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా కమ్యూనికేషన్ డేటాను వీరు యాక్సెస్ చేశారేమో తెలుసుకొనేందుకు అధికారులు దర్యాప్తు ఆరంభించారు. వెరిజోన్ ఫోన్ సిస్టమ్స్ ద్వారా హ్యాకింగ్ జరిగినట్టు అంచనావేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ క్యాంపెయిన్ సభ్యుల ఫోన్లనూ టార్గెట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.
Similar News
News January 3, 2026
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్

TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కీలకమైన నీటి అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంటే సభ్యులు లాబీలో తిరగడంపై సీరియస్ అయ్యారు. సభలో ఎవరూ లేకపోవడంతో వారిని వెంటనే లోపలికి పిలిపించాలంటూ విప్లను ఆదేశించారు.
News January 3, 2026
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్?

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం, ఖర్చు పెట్టిన నిధులపై విచారణకు సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
News January 3, 2026
ప్రముఖ నటుడికి యాక్సిడెంట్

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గువాహటిలో భార్య రూపాలీతో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులను హాస్పిటల్కు తరలించారు. తనకు స్వల్ప గాయాలైనట్లు ఆయన SM ద్వారా వెల్లడించారు. తన భార్యను ఇంకా పరిశీలనలో ఉంచారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. ఆశిష్ విద్యార్థి తెలుగులో పోకిరి, చిరుత సహా అనేక సినిమాలు చేశారు.


