News September 6, 2024
చిప్ తయారీ కంపెనీ పెడుతున్న అదానీ!

ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూప్ కలిసి భారత్‌లో చిప్ తయారీ కంపెనీని నెలకొల్పుతాయని తెలిసింది. రూ.83,947 కోట్ల పెట్టుబడితో నవీ ముంబైలో ఈ జాయింట్ వెంచర్‌ను నిర్మిస్తారని సమాచారం. మహారాష్ట్ర క్యాబినెట్ కమిటీ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు DyCM దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. ప్రాజెక్ట్ తొలి దశలో నెలకు 40వేలు, మొత్తం పూర్తయ్యాక 80వేల చిప్ వేఫర్స్ ఉత్పత్తి చేస్తారు.
Similar News
News January 20, 2026
మాఘ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఎందుకు జరుగుతాయి?

ఇది కల్యాణ కారకమైన మాసం. ఈ నెలలో ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్రాల ప్రకారం.. మాఘంలో పెళ్లి చేసుకున్న దంపతులు అన్యోన్యంగా, అష్టైశ్వర్యాలతో, సంతాన సౌభాగ్యంతో వర్ధిల్లుతారని నమ్మకం. ప్రకృతి పరంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం, పంటలు చేతికి వచ్చి శుభకార్యాలకు అనువైన సమయం కావడం వల్ల కూడా ఈ మాసంలో ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ మాసం వివాహ వేడుకలకు కేంద్రబిందువుగా మారుతుంది.
News January 20, 2026
పవన్ పిలుపుతోనే ఏపీలో షూటింగ్: నవీన్ పొలిశెట్టి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతోనే ‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం గోదావరి జిల్లాల్లో జరిగిందని హీరో నవీన్ పొలిశెట్టి తెలిపారు. ఏపీలో మూవీ షూటింగ్స్ జరగాలని ఓ కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్ తన హృదయాన్ని తాకాయన్నారు. చిత్రీకరణ ఎక్కడ చేసినా అధికారులు ఈజీగా పర్మిషన్లు ఇచ్చారని, పూర్తి సహకారం అందించారని తెలిపారు. నిన్న రాజమండ్రిలో నవీన్, మీనాక్షీ చౌదరి సందడి చేశారు.
News January 20, 2026
ఆర్సీబీ సరికొత్త చరిత్ర

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్లో RCB తన చివరి మ్యాచ్‌లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిన్న గుజరాత్‌తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.


