News March 17, 2024

నేటి నుంచి చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర

image

చీపురుపల్లిలో నేటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న శ్రీకనక మహాలక్మి అమ్మవారు జాతర జరగనుంది. ఈ జాతరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. స్థానిక పోలీసు అధికారులతో శనివారం చీపురుపల్లిలో పర్యటించారు. 18 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, సుమారు 8 వందల మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలు వేశామన్నారు. అల్లరి మూకలపై, ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

Similar News

News January 25, 2026

ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

image

విజయనగరం జిల్లాలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్ అందిస్తోందని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, IT/ITES రంగాల్లో ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు apdascac.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 25, 2026

కన్నుల పండుగలా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలి: ఎస్పీ

image

గణతంత్ర దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించాలని SP దామోదర్ అధికారులను ఆదేశించారు. జనవరి 26న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, ప్రజలు, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. వాహనాల పార్కింగ్, తనిఖీలు, శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.