News December 2, 2024

చిరంజీవికి ‘భారతరత్న’ వస్తుంది: బండ్ల గణేశ్

image

చిరంజీవి, బాలకృష్ణపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బాలయ్యకు పద్మవిభూషణ్, మెగాస్టార్‌కు భారతరత్న వస్తుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు?’ అని ఓ జర్నలిస్టు ఆయనను ప్రశ్నించారు. దీనికి గణేశ్ స్పందిస్తూ ‘వారికి అర్హత ఉంది. పురస్కారం వస్తుందనే నమ్మకముంది. చిన్నవయసులోనే సచిన్‌కు కూడా భారతరత్న ఇచ్చారు. మెగాస్టార్‌కు కూడా 200% వస్తుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2026

బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చెప్పండి: మనోహర్

image

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు గ్యాస్ కొరత లేదని, గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్లు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ల నిల్వలు, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా నిఘా బృందాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాంటివి ఎక్కడైనా ఉంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 10, 2026

చమురులో రకాలు.. ఈ విషయం తెలుసా?

image

అమెరికా, వెనిజులా, ఇరాన్, రష్యాలో లభించే చమురులో ఉండే వ్యత్యాసాల గురించి మీకు తెలుసా? అమెరికాకు చెందిన WTI (39–41° API) అత్యంత తేలికైనది కాగా వెనిజులాకు చెందిన Merey (15–16° API) అత్యంత బరువైనది. ఇరాన్ చమురు (33–36° API) మధ్యస్థంగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా అనేక రిఫైనరీలకు అనుకూలంగా ఉంటుంది. అందుకే హార్ముజ్ జలసంధిలో సరఫరా నిలిస్తే, రిఫైనరీల సామర్థ్యం తగ్గి లాభాలు పడిపోతాయి.

News March 10, 2026

కొరత లేదు.. LPG ఉత్పత్తి 10% పెంపు

image

దేశంలో గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. ఆయిల్ కంపెనీలు 10% LPG ఉత్పత్తిని పెంచాయని, అన్ని కంపెనీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొంది. కృత్రిమ కొరత నివారణపై కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. కేంద్రం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే బుకింగ్ పీరియడ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచినట్లు ప్రకటించింది.